AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాలకు దేవుడిని వాడుకుంటున్నారన్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోపణలు నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.