TG: రాష్ట్ర అవసరాలకు కొరత లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. నూతన ఎనర్జీ పాలసీని ప్రకటించి దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. 2034-35 నాటికి రాష్ట్రంలో 31,809 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు అవకాశం ఉందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా 2025 మార్చి నాటికి పూర్తి స్థాయిలో గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామన్నారు.