TG: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆయనకు నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. కొండా లక్ష్మణ్ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మఖ్యమంత్రి సహా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, మైనంపల్లి రోహిత్.. శాట్ ఛైర్మన్ శివసేన ఉన్నారు.