కెనడా సైబర్ ఆరోపణలపై భారత్ సీరియస్ అయింది. భారత్ నుంచి సైబర్ ముప్పు ఉందంటూ.. తన అధికారిక పత్రంలో కెనడా ఆరోపణలు చేసింది. దీంతో కెనడా ఆరోపణలు నిరాధారమని భారత ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి నిరసన తెలియజేశామని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. కెనడా సిక్కుల హత్య వెనుక అమిత్ షా ప్రమేయం అంటూ కెనడా ఆరోపించింది. ఈ క్రమంలో భారత్లో కెనడా హైకమిషన్ ప్రతినిధికి అధికారులు సమన్లు జారీ చేశారు.