AP: నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఎన్.ఎం.డి. ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి సహా నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. ‘ జిల్లా అభివృద్ధికి కూటమి పార్టీల నేతలందరం కలిసి పనిచేస్తాం. కూటమి పార్టీ విజయాలను ప్రజల్లకి తీసుకెళ్తాం. నీటి సంఘాల ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు పోటీ చేస్తాయి’ అని అన్నారు.