AP: ఎంపీ వేమిరెడ్డికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్షమాపణలు చెప్పారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. స్వాగత కార్యక్రమంలో మంత్రులకి మాత్రమే బొకేలు ఇచ్చి.. వేదికపైనే ఉన్న ఎంపీ వేమిరెడ్డిని అధికారులు పట్టించుకోలేదు. అయితే వేమిరెడ్డి అసహనంతో వేదిక దిగి వెళ్లిపోయారు. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎంపీ వేమిరెడ్డికి మంత్రి ఆనం క్షమాపణలు చెప్పారు.