నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి తొమ్మిదిరోజుల పాటు రకరకాల నైవేద్యాలను నివేదిస్తుంటారు. అయితే ఆ ప్రసాదాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయని వాటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. పొంగలితో రక్తహీనత, కండరాల నొప్పులు తగ్గుతాయి. దద్దోజనం.. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పాయసం.. రక్తంలోని కొవ్వులని నియంత్రిస్తుంది. పులగం.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.