TG: హైడ్రాకు ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ)లను డిప్యూటేషన్‌పై పంపించాలని నీటిపారుదలశాఖ నిర్ణయించింది. తెలంగాణ నీటిపారుదల చట్టంలోని కొన్ని అధికారాలను హైడ్రాకు బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. దీంతో హైడ్రాకు డిప్యూటేషన్‌పై వెళ్లాలనుకునే డీఈఈలు ఈనెల 30లోగా సంబంధిత ఈఎన్సీ/సీఈలకు విజ్ఞప్తి చేసుకోవాలని ఈఎన్సీ(అడ్మిన్) అనిల్‌కుమార్ సూచించారు.