TG: మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారం ఉందికదా అని విర్రవీగిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు.. జైలు ఊచలు లెక్కపెట్టక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో కూడా అధికారులు ఇలానే వ్యవహరిస్తే.. తాము అధికారంలోకి వచ్చాక మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు.