TG: వైసీపీ మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. కృష్ణయ్య నివాసానికి వెళ్లిన మల్లు రవి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న ఎంపీ పదవికి కృష్ణయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ పెద్దల సూచనతోనే ఆయన రాజీనామా చేశారని.. త్వరలోనే కాషాయం కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.