కర్ణాటకలో కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధించడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న ఉత్కంఠ నెలకొంది. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పోరు సాగుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సిద్ధ రామయ్య వెపు మొగ్గు చూపుతారని తెలిస్తున్నది
కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah)కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని సోమవారం ఓ నివేదిక వెల్లడైనట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. కానీ, కర్ణాటక సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నేటి రాత్రి కాంగ్రెస్ పరిశీలకులు తమ నివేదికను పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)కు అందజేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా వెల్లడించారు. ఎమ్మెల్యేలందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని పరిశీలకుల్లో ఒకరైన జితేంద్ర సింగ్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు సమావేశం జరిగిందని, తాము ఒక నివేదికను సిద్ధం చేశామని, దానిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికి అందిస్తున్నామని పరిశీలకులు అన్నారు.
DK శివకుమార్ (DK Sivakumar)ఇప్పటికీ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు బెయిల్ మంజూరు చేయడానికి ముందు మనీలాండరింగ్ మరియు పన్ను ఎగవేత ఆరోపణలపై తీహార్ జైలులో ఉన్నారు. కొత్త సీఎంను ఎన్నుకోవడానికి శాసన సభా పక్ష సమావేశం అవుతుంది. ఇందుకు సంబంధించి ముగ్గురు పరిశీలకులను సుశీల్ కుమార్ షిండే(Susheel Kumar Shinde), జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను నియమించింది. కర్ణాటక సీఎం పదవిని దక్కించుకునేందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ఈ రోజు మాట్లాడుతూ సిద్ధరామయ్య, డికే శివకుమార్ ఇద్దరూ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులేనని, ఇద్దరూ ముందుండి కర్ణాటకలో పార్టీ కోసం పని చేశారని, నాయకత్వం వహించారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయడానికి ఇద్దరూ తమ శాయశక్తులా కృషి చేశారన్నారు. అయితే కర్ణాటక సీఎం (Karnataka CM) ఎవరు అవుతారో చూద్దామని, సీఎల్పీ అభిప్రాయం ఏమిటో చూద్దామన్నారు.