మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు షాక్ తగిలింది. తనను రిమాండ్ చేసి అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
Delhi Liquor Policy Case: మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు షాక్ తగిలింది. తనను రిమాండ్ చేసి అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అంతకుముందు కూడా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను ఈడీ గురువారం హైకోర్టులో వ్యతిరేకించింది.
ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను చట్టానికి లోబడి అరెస్టు చేశారనీ, రిట్ పిటిషన్ ముసుగులో బెయిల్ దరఖాస్తు చేసుకున్న అతని అభ్యర్థన ఒప్పుకోలు కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ సంజయ్ సింగ్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేశారు. ఆ తర్వాత శుక్రవారం పిటిషన్ను తిరస్కరించారు.
Delhi High Court dismisses Aam Aadmi Party leader and Rajya Sabha MP Sanjay Singh’s plea challenging his remand and arrest in the alleged liquor scam case.
అక్టోబర్ 4న ఈడీ అరెస్ట్
అక్టోబర్ 4న సంజయ్ సింగ్ను ఈడి అరెస్టు చేసింది. తన అరెస్టును ఆయన గత వారం హైకోర్టులో సవాలు చేశారు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారని, దీంతో కొందరు మద్యం తయారీదారులు, హోల్ సేల్ వ్యాపారులు, చిల్లర వ్యాపారులు ఆర్థికంగా లాభాలు గడించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.