Kejriwal targets PM Modi:ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ సారి చదువు (education) గురించి మాట్లాడారు. దేశానికి చదువుకున్న ప్రధాని (pm) కావాలని కేజ్రీవాల్ (Kejriwal) అభిప్రాయపడ్డారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా (manish sisodia), సత్యేంద్ర జైన్ (satyendra jain) అరెస్టును ప్రస్తావిస్తూనే విమర్శలు చేశారు.
‘Country should have educated PM’ Arvind Kejriwal targets PM Modi
Kejriwal targets PM Modi:ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు (Kejriwal) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (modi) అంటే పడదు. వివిధ అంశాలపై విభేదించడమే కాదు.. ఉప్పు- నిప్పులా ఉంటారు. ఈ సారి చదువు (education) గురించి మాట్లాడారు. దేశానికి చదువుకున్న ప్రధాని (pm) కావాలని కేజ్రీవాల్ (Kejriwal) అభిప్రాయపడ్డారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా (manish sisodia), సత్యేంద్ర జైన్ (satyendra jain) అరెస్టును ప్రస్తావిస్తూనే విమర్శలు చేశారు. మనీశ్ సిసోడియాను జైలుకు పంపిన రోజే విద్య ప్రాధాన్యత తెలిసిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని తాను భావించానని చెప్పారు.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) జరిగిన ర్యాలీలో అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) పాల్గొన్నారు. ఆప్ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ (free power), విద్య (education), ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీకి మధ్యప్రదేశ్ ప్రజలు చాలాసార్లు అవకాశాలు ఇచ్చారని గుర్తుచేశారు. గత కొన్నేళ్ల నుంచి ఆ పార్టీలు రాష్ట్రాన్ని ఏలాయని గుర్తుచేశారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) కోరారు. ఢిల్లీ (delhi), పంజాబ్‌లో (punjab) అమలు చేస్తున్న విధంగా ఇక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు.
కరోనా వైరస్ వచ్చిన తొలినాళ్లలో ప్రధాని మోడీ (modi) పేర్కొన్న అంశాలను కేజ్రీవాల్ (Kejriwal) ఉదహరించారు. మోడీ చదువుకోలేదు.. కాబట్టే.. ప్లేట్లను (plates) కొట్టాలని పిలుపునిచ్చారన.. అలా చేస్తే మరీ వైరస్ పారిపోయిందా అని అడిగారు. అలాగే రాత్రి 9 గంటలకు బిజీలీ బంద్ చేయమని కోరారని.. అప్పుడైనా వైరస్ వెళ్లిందా అని ప్రశ్నించారు. సిసోడియా, జైన్.. ఢిల్లీలో మంచి విద్య, వైద్యారోగ్య శాఖలను పటిష్టం చేశారని తెలిపారు. కానీ ఇదీ మోడీకి నచ్చలేదని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం స్కామ్ కేసులో ఇప్పటివరకు ఒకరు కూడా జైలుకు వెళ్లలేదని కేజ్రీవాల్ (Kejriwal) చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జరిగిన అవినీతి.. బీజేపీలో చేరిన తర్వాత పోతుందని.. ఇప్పుడు అదే జరుగుతుందని తెలిపారు.