తనను నిర్మాత లైంగికంగా వేధించాడంటూ ఓ టీవీ నటి ఆరోపణలు చేసింది. “తారక్ మెహతా కా ఊల్తా చష్మా” సీరియల్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నటి జెన్నిఫర్ బన్సీవాల్ ఆ షో నుంచి తప్పుకున్నారు. నిర్మాత అసిత్ మోడీ తనను లైంగిక వేధింపులు గురిచేశాడని ఆమె ఆరోపించింది. నిర్మాత అసిత్ తో పాటు షో ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్ కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పేర్కొంది. అందుకే తాను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ఆమె పేర్కొనడం గమనార్హం. ఈమేరకు ఆమె ఇటీవల పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తనను అసిత్ మోడీ చాలా సార్లు వేధించాడని ఆమె పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనని తరచూ గదికి రమ్మని, విస్కీ తాగుదామని అడిగేవాడని ఆమె చెప్పింది. అతని ప్రవర్తన నచ్చక తాను షో మానేస్తానని చెబితే, నాలుగు నెలలచెల్లింపులు ఇవ్వకుండా ఒత్తిడికి గురిచేశారని వాపోయింది. కాగా, ఆమె తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఆమెపై న్యాయపోరాటానికి కూడా తాను సిద్ధమని నిర్మాత అసిత్ మోడీ పేర్కొనడం గమనార్హం. తనపై ఆరోపణలు చేయడంతో పాటు తన షో ని నాశనం చేయాలని ఆమె చూస్తోందని, తన షోని బ్యాడ్ చేయాలని అనుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. తనపై నిరాదారోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఆమె ప్రవర్తన సరిగాలేకపోవడం వల్లే షో నుంచి తొలగించానమి ఆయన చెప్పడం గమనార్హం.