నాగ చైతన్యతో విడాకుల తర్వాత సినీ కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది సమంత. ముఖ్యంగా బాలీవుడ్ పై మరింతగా ఫోకస్ చేసింది అమ్మడు. అక్కడ ఓ వెబ్ సిరీస్‌తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించింది. ఇక తెలుగులో శాకుంతలం, ఖుషీతో పాటు యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ముందుగా యశోద సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ‘యశోద’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు టీజర్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇందులో సమంత ‘యశోద’ అనే గర్భిణీ స్త్రీ పాత్రలో నటిస్తోంది. టీజర్లో ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చెప్తుండగా.. దానికి రివర్స్‌లో యశోద లైఫ్‌లో జరిగే ఊహించని సంఘటనలను చూపించారు. ఇందులో సమంత గర్భిణీ లేడీగా.. యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టినట్టు తెలుస్తోంది. అయితే టీజర్లో సమంత, ఓ లేడీ డాక్టర్, ఉన్ని ముకుందన్ తప్పితే మిగతా నటీ నటులను ఎవరిని చూపించలేదు. దాంతో యశోద టీజర్ సమంత వన్ మ్యాన్ షోగా ఉందని చెప్పొచ్చు. త్వరలోనే ‘యశోద’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి యశోదగా సమంత ఎలా ఆకట్టకుంటుందో చూడాలి.