ఒకప్పుడు స్టార్స్ గా వెలిగిన నటులు ఆ తర్వాత తమ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఉంటారు. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే, ఇంకొందరు సక్సెస్ అవ్వరు. 1980s లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాధ, తన కూతుళ్లు కార్తీక, తులసి హీరోయిన్లు గా పరిచయమయ్యారు, కానీ త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోయారు.
తెలుగు, తమిళ్, హిందీ లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలిన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ ఇప్పటికి సరైన హిట్ అయితే పడలేదు.
ఇప్పుడు తాజాగా సీనియర్ హీరోయిన్ రోజా కూతురు అన్షు మాలిక హీరోయిన్ గా తెలుగు లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అన్షు మాలిక ఇప్పటికే యూ ఎస్ లోని ఓ ఫేమస్ ఫిలిం ఇన్ స్టిట్యుట్ లో సీటు రావడంతో ప్రస్తుతం అక్కడ శిక్షణ పొందుతోంది.
రోజా కూతురు, ఓ టాలీవుడ్ సినీ వారసుడు హీరోగా నటించే సినిమాతోనే ఆమె హీరోయిన్ గా పరిచయమవుతుంది సమాచారం. ప్రస్తుతం రోజా.. టీవీ షోలోకు దూరంగా ఉంటూ.. కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారు. కాగా.. సినిమాలకు ప్రస్తుతం దూరంగా ఉన్న రోజా, తన ఫోకస్ తన కూతురు కెరీర్ మీద పెట్టినట్లు తెలుస్తోంది.