Pawan Kalyan : ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సర్ప్రైజ్లు వస్తున్నాయి. హరిహర వీరమల్లు కంప్లీట్ అవకముందే.. ఏకంగా మూడు సినిమాలు మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్‌లో హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ 'ఓజి' సినిమాల షూటింగ్ మొదలు కానున్నాయి.
ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సర్ప్రైజ్లు వస్తున్నాయి. హరిహర వీరమల్లు కంప్లీట్ అవకముందే.. ఏకంగా మూడు సినిమాలు మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్‌లో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ ‘ఓజి’ సినిమాల షూటింగ్ మొదలు కానున్నాయి. అయితే ముందుగా క్రిష్‌కు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 5 నుంచి హరిహర వీరమల్లు రీ స్టార్ట్ కానుందని టాక్. ఆ తర్వాతే ఉస్తాద్, ఓజి షూటింగ్ అంటున్నారు. అయితే పవన్ చేతిలో ఇన్ని ప్రాజెక్ట్స్ ఉండగానే.. తాజాగా మరో ఊహించని డైరెక్టర్‌తో సినిమా కన్ఫామ్ అయిపోయింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. త్రివిక్రమ్ హ్యాండ్ లేకుండా పవన్ సినిమాల రావడం కష్టమనే టాక్ ఉంది. భీమ్లా నాయక్, ప్రజెంట్ షూటింగ్ స్టేజ్‌లో ఉన్న రీమేక్ సినిమాల వెనక మాటల మాంత్రికుడి హస్తం ఉంది. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా త్రివిక్రమ్‌నే ఫైనల్ చేస్తున్నట్టు టాక్. ఇప్పటికే త్రివిక్రమ్.. పవన్ కోసం మరో డైరెక్టర్ని రంగంలోకి దించేశాడు. యంగ్ డైరెక్టర్ సుధీర్‌వర్మతో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్. తాజాగా రావణాసుర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు సుధీర్‌వర్మ. ఎప్పుడో పవన్‌తో సినిమా ఫిక్స్ అయిందని.. కాకపోతే మెయిన్ స్టోరీ ఐడియా త్రివిక్రమ్‌దేనని చెప్పాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. దీంతో ఈ సినిమా లేట్‌గా స్టార్ట్ అయినా.. త్రివిక్రమ్ ఐడియా కాబట్టి.. ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనా.. ఇది మాత్రం నిజంగానే ఊహించని కాంబినేషన్ అనే చెప్పాలి.