మెగాస్టార్ చిరంజీవిని కింగ్ నాగార్జున తాజాగా కలిశారు. త్వరలో జరగనున్న ANR జాతీయ అవార్డుల కార్యక్రమానికి చిరును ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అక్టోబర్ 28న ANR అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాగా, చిరంజీవికి ANR జాతీయ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.