గతేడాది ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ మాసివ్ హిట్ అందుకున్నారు. అయితే భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి.. ఎలాంటి సినిమా అప్టేట్స్ రావడం లేదు. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడమే అందుకు కారణమని చెప్పొచ్చు. అయితే క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే భీమ్లా నాయక్‌తో పాటే మొదలైన ఈ సినిమా.. ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతు వస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అనడమే తప్పా.. షూటింగ్ అప్టేట్ మాత్రం రావడం లేదు. అలాగే రిలీజ్ డేట్ విషయంలోను క్లారిటీ రావడం లేదు. కానీ వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఈసారి పవర్ స్టార్ బర్త్ డే కానుకగా ‘హరిహర వీరమల్లు’ నుంచి టీజర్ లేదా.. కొన్ని పోస్టర్స్‌తో లేదా మేకింగ్ వీడియోలను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక అదే రోజు హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ అప్టేట్ కూడా ఇవ్వబోతున్నట్టు టాక్. దాంతో పాటు తమిళ్ రీమేక్ మూవీ ‘వినోదయ సీతమ్’ షూటింగ్ అప్టేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రీమేక్‌లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఇక పవన్ బర్త్ డేకి బిగ్ సర్ప్రైజ్ అని తెలియడంతో.. మరింత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. అయితే నిజంగానే పవన్ నుంచి బిగ్ అప్టేట్ రాబోతోందా.. లేదా అనేది తెలియాలంటే.. మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.