Jr NTR : పార్టీ లేదా పుష్పా.. బన్నీకి ఎన్టీఆర్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మధ్య మంచి స్నేహం ఉంది. 'బావ... బావ' అని పిలుచుకునే చనువు ఉంది. అది అందరికీ తెలుసు. బావను ఎన్టీఆర్ పార్టీ అడిగితే... అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మధ్య మంచి స్నేహం ఉంది. ‘బావ… బావ’ అని పిలుచుకునే చనువు ఉంది. అది అందరికీ తెలుసు. బావను ఎన్టీఆర్ పార్టీ అడిగితే… అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళితే…అల్లు అర్జున్ (Allu Arjun Birthday) పుట్టినరోజు సందర్భంగా శనివారం స్టార్స్ చాలా మంది సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. అందులో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళకు రిప్లై ఇస్తూ ఇస్తూ… ఎన్టీఆర్ బావకు కూడా థాంక్స్ చెప్పారు బన్నీ. ఆ తర్వాత మొదలైంది అసలు కథ! హగ్గులు మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?’ అంటూ ఎన్టీఆర్ అడిగారు.
‘పుష్ప'(Puspa)లో విలన్ రోల్ చేసిన మలయాళ హీరో ఫహాద్ (Malayalam hero Fahadh)ఫాజిల్ చెప్పిన ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. సోషల్ మీడియా ఒక్కసారిగా హోరెత్తింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘వస్తున్నా’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఓ టీజర్ కూడా విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ చెప్పే ఆఖరి డైలాగ్… వస్తున్నా. అదీ సంగతి! ఇప్పుడు అర్థమైంది కదా!ఎన్టీఆర్ 30లోని డైలాగ్‌ను గుర్తుకు తెచ్చేలా సమాధానమిచ్చారు. ఇద్దరు స్టార్లు ఒకరి సినిమాల్లో పాపులర్ డైలాగ్స్(Popular Dialogues)ను మరొకరు ప్రస్తావిస్తూ సాగించిన సంభాషణ నెటిజన్లకు బాగా నచ్చింది. ఈ క్రమంలోనే ‘బావ’ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది