టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ,బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులు కేఎల్ రాహుల్, అతియా శెట్టిలకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా, టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం న్యూజిలాండ్ తో మూడో వన్డేకు సిద్ధమవుతుండడంతో జట్టులోని వారెవరూ ఈ పెళ్లికి రాలేదు. ఇషాంత్ శర్మ, వరుణ్ ఆరోన్ వంటి క్రికెటర్లు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ తదితరులు విచ్చేశారు. రాహుల్, అతియా పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. కేఎల్ రాహుల్, అతియా శెట్టి చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం, ఒకరి పోస్టులపై మరొకరు కామెంట్లు చేయడం ద్వారా వీరు తమ బంధాన్నిఎప్పటికప్పుడు వెల్లడిస్తూ, అందరి దృష్టిలో పడ్డారు.