డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు అంతా ఓటీటీల మయం. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం రేర్. ఓటీటీలో మూవీలే కాదు.. వెబ్ సిరీస్, స్పోర్ట్స్ లైవ్, టాక్ షో వస్తున్నాయి. తెలుగులో ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ ఓ రేంజ్లో హిట్ అయ్యింది. రెండో సీజన్ కూడా నడుస్తోంది. ఆ షోకు ధీటుగా సోని లివ్ కూడా టాక్ షో తీసుకొస్తోంది. అందులో గాయనీ స్మితను హోస్ట్‌గా తీసుకున్నారు. ఆమె ఇప్పటికే పలువురిని ఇంటర్వ్యూ కూడా చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఎపిసోడ్స్ స్ట్రీమ్ కానున్నాయి.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, నటులు నాని, రాణా, అడవి శేష్, సాయి పల్లని ఇంట్వర్యూ చేశారు. దానికి సంబంధించి ఓ వీడియోను సోని లివ్ వదిలింది. నిజం విత్ స్మిత అనే టాక్ షోకు నిజం నిర్భయంగా అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. చంద్రబాబును మాటకు ముందు వెన్నుపోటు అని అంటారు అనగా.. తెలంగాణ సీఎం కూడా భాగస్వామి అని సమాధానం ఇచ్చారు. సినిమాల్లో ట్రై చేస్తావా? నీ కులమెంటీ అని చిరంజీవి అడిగారు. చరణ్ సినిమాను కోటి మంది చూశారు.. చూసినవారే కదా నెపోటిజాన్ని ఎంకరేజ్ చేసింది అని నాని అన్నారు. సినిమా వల్ల సమాజం చెడిపోతుందని తప్పు అని దర్శకుడు దేవ కట్టా సమాధానం ఇచ్చారు. అసభ్య పదజాలంతో దూషించడం ఏంటీ అని సాయి పల్లవి గొంతెత్తారు. అప్పట్లో హీరోయిన్లకు విలువ ఉండేదని రాధిక చెప్పుకొచ్చారు.
టాలీవుడ్లో దాగిన చీకటి కోణాన్ని స్మిత వెలుగులోకి తీసుకొస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. టాక్ షోకు వచ్చిన వారిని మాత్రం నిర్మోహమాటంగా ప్రశ్నలు అడిగేశారు. ఈ షోకు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరణ చూపిస్తారో చూడాలి. సోని లివ్ తెలుగుకు సబ్ స్కైబర్స్ తక్కువే.. స్మిత టాక్ షో వల్ల అయినా పెరుగుతుందో చూడాలి మరీ.