»Animal Collections Animal Has Joined The Rs 500 Crore Club
Animal Collections: రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరిన యానిమల్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్లో చేరింది.
Animal Collections: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే కోట్ల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. మొదటి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.116 కోట్లు రాగా, రెండో రోజు రూ.236 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.527 కోట్లు వసూలు చేసింది. ఇండియాలోనే దాదాపుగా రూ.313 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. త్రిప్తి దిమ్రీ కూడా ఈ సినిమాలో నటించింది.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన తర్వాత యానిమల్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్టుగానే యానిమల్ బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే రణబీర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సంజు(రూ.586.85 కోట్లు) సినిమాను యానిమల్ అధిగమించే అవకాశం ఉంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే మూవీ వెర్షన్ కంటే 20 నిమిషాలు ఎక్కువగా ఓటీటీ వెర్షన్ ఉండబోతుందట.