»Anil Kapoor Deleted All The Posts From Instagram Know Reason Here
Anil Kapoor : షాకింగ్.. బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ అకౌంట్ ఖాళీ చేసిన హ్యాకర్లు
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ యాక్టర్ అనిల్ కపూర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలుసు. అయితే ఉన్నట్లుండి, ఆయన ఇన్ స్టాగ్రామ్ ఖాతా మొత్తం ఖాళీ అయింది.
Anil Kapoor : బాలీవుడ్ ఎవర్ గ్రీన్ యాక్టర్ అనిల్ కపూర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలుసు. అయితే ఉన్నట్లుండి, ఆయన ఇన్ స్టాగ్రామ్ ఖాతా మొత్తం ఖాళీ అయింది. ఆయన అకౌంట్ లోని అన్ని పోస్టులు తొలగించబడ్డాయి. ఫోటోలు, వీడియోలు ఒక్కటి కూడా లేవు. అయితే, ఆయనే స్వయంగా వీటన్నింటినీ డిలీట్ చేశాడా.. లేదా ఎవరైనా తన ఖాతాను హ్యాక్ చేసిన పోస్టులను డిలీట్ చేశారా అన్నది తెలియరాలేదు.
నటుడు అనిల్ కపూర్ తన సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తరచుగా ఆయన తమ ఫోటోలు, జిమ్ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే ఇప్పుడు అతని ఖాతా నుంచి వీడియోలు, చిత్రాలు అన్నీ డిలీట్ అయ్యాయి. దీనిపై ఇప్పుడు అభిమానులతో పాటు ఆయన కూతురు, నటి సోనమ్ కపూర్ కూడా స్పందించింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.
అనిల్ భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్ ఇటీవల ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’లో కనిపించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆదిత్య కపూర్‌తో కలిసి ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌లో కనిపించాడు. ఇందులో ఆయన శోబితా ధూళిపాళతో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇవి కాకుండా త్వరలో సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో ‘యానిమల్’ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో అతనితో పాటు రణబీర్ కపూర్, రష్మిక మందన్న కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది.