ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోవడంతో.. ఆయన బృందంలోని సభ్యురాలు మోహినిదేతో లింక్ ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో మరోసారి స్పందించిన మోహినిదే.. రెహమాన్ తనకు తండ్రితో సమానమని పేర్కొన్నారు. ఇలాంటి రూమర్స్ వినడం బాధగా ఉందన్నారు. ‘నాది, రెహమాన్ కుమార్తెలది ఒకే వయసు. ఆయనెప్పుడూ నన్ను తన కుమార్తెలానే చూసేవారు. 8 ఏళ్లకు పైగా ఆయన బృందంలో పనిచేశాను. ఆయనంటే ఎంతో గౌరవం ఉంది’ అని తెలిపారు.