Congo : డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మై-నోంబే ప్రావిన్స్‌లోని క్వా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ నదిలో పడవ మునిగిపోవడంతో 80 మందికి పైగా మరణించారు. బుధవారం జరిగిన పడవ ప్రమాదంపై ఆ దేశాధ్యక్షుడు విచారణకు ఆదేశించారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మై-నోంబే ప్రావిన్స్‌లోని క్వా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో 80 మందికి పైగా మరణించారని అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇలాంటి దురదృష్టకర సంఘటన మళ్లీ జరగకూడదని అన్నారు. అందువల్ల ఈ ఘోర ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.
కాంగో జలాల్లో ప్రమాదకరమైన పడవ ప్రమాదాలు సర్వసాధారణం. ఇక్కడ పడవలు వాటి సామర్థ్యానికి మించి లోడ్ అవుతాయి. సెంట్రల్ ఆఫ్రికన్ దేశం విస్తారమైన అటవీ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ రోడ్ల విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ జనాలు నది ద్వారా ప్రయాణం చేస్తుంటారు. ముషి నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వా నదిలో జరిగిన పడవ ప్రమాద ఘటనకు అసలు కారణాలపై దర్యాప్తునకు రిపబ్లిక్ ప్రెసిడెంట్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తు మళ్లీ జరగకుండా చూడాలని ప్రెసిడెంట్ ఆఫీసు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
#RDC 12.06.2024|#Kinshasa
Le Président Félix Tshisekedi s’est dit meurtri par le drame du naufrage survenu sur la rivière Kwa, à 70 kilomètres de la cité de Mushie, dans la province de Maï-Ndombe, dont le bilan provisoire fait état de plus de 80 morts.
ఈ విపత్తులో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ దురదృష్టకర సంఘటనకు నిజమైన కారణాలను స్పష్టం చేయడానికి.. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు పునరావృతం కాకుండా నిరోధించడానికి ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ప్రెసిడెంట్ అన్నారు. మై-నడోంబే ప్రావిన్స్ గవర్నర్ రీటా బోలా దులా రాయిటర్స్‌తో మాట్లాడుతూ రాత్రి నౌకాయానం చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పారు.