Pawan : పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఇద్దరు కన్నడ హీరోలకు క్షమాపణలు చెప్పారు. పవన్ ఏంటి..? కన్నడ హీరోలకు క్షమాపణలు చెప్పడం ఏంటి..? అనే ఆశ్చర్యపోతున్నారా..? దానికి కారణం లేకపోలేదు.
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఇద్దరు కన్నడ హీరోలకు క్షమాపణలు చెప్పారు. పవన్ ఏంటి..? కన్నడ హీరోలకు క్షమాపణలు చెప్పడం ఏంటి..? అనే ఆశ్చర్యపోతున్నారా..? దానికి కారణం లేకపోలేదు.
ఇంతకీ మ్యాటరేంటంటే…. ఇప్పటికే పవన్… ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన వేరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈ కారణంగా ప్రముఖ కన్నడ స్టార్స్ ఉపేంద్ర , కిచ్చ సుదీప్ కి పవర్ స్టార్ క్షమాపణలు చెప్పారు.
‘‘ఆడియో ఫంక్షన్‌కి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ‘కబ్జా’ టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే, రాజకీయపరంగా ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల వల్ల ఈ ఈవెంట్‌కి హాజరుకాలేకపోతున్నాను. దీనికి నేను చాలా బాధపడుతున్నాను. ఇక హీరోలు ఉపేంద్ర, సుదీప్‌కు నా ప్రత్యేక శుభాకాంక్షలు. వారు వెరైటీ పాత్రలు పోషిస్తూ వివిధ భాషల్లో గుర్తింపు సాధించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్ చంద్రు ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్‌ని సాధించాలి. నిర్మాత శ్రీరామ చంద్ర గౌడ, సంగీత దర్శకులు రవి బస్రూర్, ఇతర మూవీ టీంకి నా శుభాకాంక్షలు’’ అని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.