అనన్య పాండే ఫ్యామిలీతో స్పెయిన్ టూర్‌కు వెళ్లింది. ప్రస్తుతం ముంబైకి చేరుకున్న ఆమె టూర్ వేకెషన్కు సంబంధించిన ఫోటోలకు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.
ఇబిజా అనే చోట తీసుకున్న మధురజ్ఙాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో మొదటి రెండు పిక్స్ అనన్య తెల్లటి దుస్తుల్లో అందంగా కనిపిస్తోంది.
వైట్ కలర్ డ్రెస్‌లతో అనన్య ఫ్యామిలీ తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేసింది. తన తండ్రి చుంకీ పాండే, తల్లి భావన పాండే, సోదరి రైసా పాండేతో మొత్తం కుటుంబాన్ని ఆ ఒక్క ఫోటోలో బంధించింది. అలాగే ఇంకా కొన్ని ఫోటోలలో హాలిడే నివాసం, పరిసరాలకు సంబంధించిన పిక్స్ ఉన్నాయి.
బాలీవుడ్ ప్రేమజంటల్లో అనన్య పాండే, ఆదిత్య రాయ్ తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరి ప్రేమను అధికారికంగా ప్రకటించక పోయినా పార్టీ, వేకేషన్లో జంటగా కనిపిస్తూ నిజమేనన్న స్పష్టతను ఇస్తున్నారు.
రాఖీ ఔర్ రాణి కియి ప్రేమ్ కహానీలో అనన్య పాండే అతిథి పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో హీరోగా రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు.