ప్రస్తుతం కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ ‘వారిసు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతన్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’గా రాబోతోంది. శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దాంతో తమిళ్‌తో పాటు తెలుగులోను వారసుడు పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్సాన్స్ వస్తోంది. ఫస్ట్ సింగిల్‌గా వచ్చిన రంజితమే సాంగ్ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. రీసెంట్గా వచ్చిన ‘సోల్ ఆఫ్ వరిసు’ సాంగ్‌తో మరింత హైప్ క్రియేట్ చేశారు. దాంతో ‘వరిసు’ ఆడియో లాంచ్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు నుంచి వినిపించినట్టుగానే.. డిసెంబర్ 24న సాయంత్రం 4 గంటలకు ఆడియో లాంఛ్ ఈవెంట్ ఉంటుందని తెలిపారు మేకర్స్. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ముందు నుంచి వివాదాలు చుట్టుమడుతునే ఉన్నాయి. అదే వారసుడు ప్రమోషన్స్‌కు మరింతగా కలిసొచ్చేలా ఉంది. పైగా దిల్ రాజు విజయ్ను నెం.1 హీరో అనడంతో.. అజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దాంతో కోలీవుడ్‌లో అజిత్, విజయ్‌కి ఈక్వల్‌గా థియేటర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.