పోయిన వారం.. అంటే డిసెంబర్ 23న నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశాల్ ‘లాఠీ’, నయనతార ‘కనెక్ట్’ వంటి డబ్బింగ్ సినిమాలతో పాటు.. మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’, నిఖిల్ నటించిన ’18 పేజెస్’ విడుదల అయ్యాయి. వీటిలో డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేశాయి. ఇక 18 పేజెస్ క్లాసిక్ హిట్గా నిలవగా.. ధమాకా మాసివ్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేశాయి. కాని 18 పేజెస్ కంటే.. ధమాకా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ప్రస్తుతం థియేటర్లో ఈ సినిమాదే హవా. అయితే ఈ ఇయర్ ఎండింగ్లో.. అంటే ఈ వారంలో బాక్సాఫీస్ మీద చిన్న సినిమాల దండయాత్ర జరగబోతోంది. డిసెంబర్ 30న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే అవన్ని లో బడ్జెట్ చిత్రాలే.. వాటిలో కొన్ని సినిమాల పేర్లు కూడా కనీసం జనాలకు తెలియదు. ‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ నటించిన ‘లక్కీ లక్ష్మణ్’.. తారకరత్న ‘S5’తో పాటు.. రాజయోగం, ప్రేమదేశం, నువ్వే నా ప్రాణం, ఉత్తమ విలన్, కేరాఫ్ మహదేవపురం, కోరమీను.. లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వీళ్లతో పాటు ఆది సాయి కుమార్ కూడా మరోసారి లక్ చేసుకునేందుకు వస్తున్నాడు. ఏదో సినిమాలు చేస్తున్నామా.. లేదా.. అనే ధోరణిలో ఉన్న ఆది.. ఈసారి ‘టాప్ గేర్’ అనే సినిమాతో వస్తున్నాడు. అయితే వరుస సినిమాలు చేస్తున్న ఆదికి.. హిట్ అనే మాట విని చాలా కాలం అవుతోంది. కాబట్టి ఆది సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఏదేమైనా ఈ ఇయర్ ఎండింగ్లో చిన్న సినిమాల ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూడాలి.