పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మన లెక్కల మాస్టరు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్టు.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 నిర్మించిన అభిషేక్ అగర్వాల్ సెట్ చేసినట్టు చెప్పారు. అంతకు ముందు అభిషేక్ అగర్వాల్.. ప్రభాస్, సుకుమార్‌ను కలిసిన ఫోటోలు షేర్ చేయడంతో.. నిజంగానే ఈ క్రేజీ కాంబో సెట్ అయిపోయిందనుకున్నారు. అంతేకాదు ఈ ఇద్దరి కాంబోతో పాన్ బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయమనుకున్నారు. కానీ అసలు ఈ ప్రాజెక్ట్ లేదని క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్-సుకుమార్ ప్రాజెక్ట్ పై వస్తున్నవన్నీ రూమర్స్ అని తేల్చేశారు. ఈ విషయంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రతి ప్రాజెక్ట్ గురించి టైం వచ్చినప్పుడు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాము, అప్పటివరకూ ఎలాంటి రూమర్స్‌ని నమ్మకండి’ అంటూ రాసుకొచ్చారు. దాంతో సుకుమార్, ప్రభాస్ సినిమా చేస్తున్నారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. అయితే సుకుమార్‌తో మాత్రం భారీ ప్రాజెక్ట్ ఉంటుదని గతంలోనే చెప్పుకొచ్చాడు అభిషేక్ అగర్వాల్. ప్రస్తుతం అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ‘వ్యాక్సిన్ వార్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇక సుకుమార్ వచ్చేసి ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ K, ఆది పురుష్, స్పిరిట్, దర్శకుడు మారుతీతో ఒక సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పట్లో.. సుకుమార్‌తో కలిసి ప్రభాస్ సినిమా చెయ్యడం కష్టమనే చెప్పాలి. కానీ ఈ కాంబో ఎప్పుడు సెట్ అయినా.. బాక్సాఫీస్ బద్దలయ్యేలా ఉంటుందని చెప్పొచ్చు.