Road Accident : తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున ఓ దారుణం జరిగింది. పుదుక్కోట్టై జిల్లాలో సిమెంట్ బస్తాలతో వెళ్తున్న ట్రక్కు టీ దుకాణంతోపాటు పక్కనే ఆగి ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే…తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో శనివారం తెల్లవారుజామున సిమెంట్ బస్తాలతో వెళ్తున్న ఓ ట్రక్కు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. చాలా మంది శబరిమల ఆలయ యాత్రికులు ఒక దుకాణంలో టీ తాగుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు.
ప్రాథమిక విచారణ ఆధారంగా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోవడంతో డ్రైవర్ సిమెంట్ ట్రక్కుపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. అరియలూరు నుంచి శివగంగైకి ట్రక్కు వెళ్తోంది. మరోవైపు పోలీసుల తదుపరి విచారణ కొనసాగుతోంది.