»Adventurer Remy Lucidi Died After Falling From The 68th Floor In Hong Kong
Remy Lucidi: 68వ అంతస్తు నుంచి పడి సాహసికుడు మృతి
పాములు పట్టే వ్యక్తి పాము కాటుకు గురై మరణించినట్లుగా, సాహసం చేసే వ్యక్తి మరో సాహసం చేస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడి మృత్యువాత చెందాడు. ఈ ఘటన హంకాంగ్‌లో ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ 68వ అంతస్తు నుంచి ప్రపంచ సాహసికుడు రెమీ లుసిడి చేసిన సందర్భంలో జరిగింది.
Adventurer Remy Lucidi died after falling from the 68th floor in Hong Kong
Remy Lucidi: సోషల్ మీడియాలో(Social Media) ప్రాధాన్యత పెరిగిన తరువాత చాలా మంది రకరకాలుగా సెలబ్రెటీలు(Celebrities)గా మారుతున్నారు. రాత్రికి రాత్రే స్టార్లుగా అవతరిస్తున్నారు. ఆ స్టార్ డమ్‌ను కాపాడుకోవడానికి నానా రకాల తిప్పలు పడుతున్నారు. అలానే ఫ్రాన్స్(France)కు చెందిన 30 ఏళ్ల రెమీ లుసిడి(Remy Lucidi) ప్రపంచంలో అత్యంత సాహసికుడిగా పేరుంది. అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో ఘనుడిగా పేరున్న ఈయన అదే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం అతని అభిమానులకు తీవ్ర దు:ఖంలో ముంచింది. ఈ ఘటన హాంకాంగ్(Hong Kong)లో చోటు చేసుకుంది.
హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్(Tregunter Tower Complex)ను అధిరోహించాలని ప్రయత్నించి అక్కడి నుంచి కిందపడి లుసిడి మరణించాడు. తాను కింద పడిపోవడానికి ముందు ఈ భవనం 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికి బయట చిక్కుకుపోయాడు. భయంతో కిటికీని కాలుతో బలంగా తన్నాడు. కాలు పట్టుతప్పి అక్కడి నుంచి నేరుగా కింద పడి స్పాట్లోనే మరణించాడు. అది చూసిన పని మనిషి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
లుసిడి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో భవనం సెక్యూరిటీ వద్దకు వచ్చి 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలకు వెళ్లిపోయాడు. సెక్యూరిటీ నిర్ధారణ చేసుకోగా లసిడ్ అక్రమంగా లోపలికి వెళ్లాడని తెలిసి వెనుకే వెళ్లాడు. అప్పటికే లుసిడి ఎలివేటర్లో పైకి ఎక్కాడు. ఉదయం 7.38 సమయంలో అతడిని పెంట్‌హౌస్‌లో పనిమనిషి చూసి పోలీసులకు కాల్ చేసింది. అనంతరం అతడు పట్టుతప్పి కిందపడిపోయాడు. ఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. అయితే అతడు బ్యాలెన్స్ తప్పడంతో సాయం కోసం కిటీకిని తన్ని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అతడు సాహసం చేయడానికి ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌కు వచ్చాడని నిర్ధారించారు.