సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ వారీ ఎనర్జీస్ రూ.లక్ష కోట్ల కంపెనీగా అవతరించింది. ఇటీవల IPO ద్వారా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కంపెనీ అక్టోబర్ 28న దాదాపు 70% ప్రీమియంతో లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.1503 కాగా.. BSEలో రూ.2,550 వద్ద, NSEలో రూ.2500 వద్ద నమోదైంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.67,866 కోట్లు అయింది. అయితే వారం రోజుల్లోనే కంపెనీ షేర్లు 49% లాభపడగా కంపెనీ మార్కెట్ విలువ రూ.1,03,779.62 కోట్లకు చేరింది.