AP: గ్రూప్-2 పరీక్షపై సందిగ్ధత నెలకొంది. అక్టోబర్ 30న నోటిఫికేషన్ ఇచ్చిన APPSC.. జనవరి 5 నుంచి పరీక్షలు ఉంటాయని ప్రకటించింది. అయితే నోటిఫికేషన్ తేదీ నుంచి 3 నెలల సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో గ్రూప్-2 వాయిదా వేస్తే.. DSC, టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా ఏప్రిల్/మేలో మాత్రమే నిర్వహించేందుకు వీలవుతుంది. కాగా, గ్రూప్-2 తేదీ మార్చాలా?వద్దా? అన్న దానిపై నేడో, రేపో నిర్ణయం తీసుకుంటామని APPSC వర్గాలు తెలిపాయి.