TG: నిరుద్యోగులకు CM రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. ‘MBNR జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాం. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. ప్రతి గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.