AP: వచ్చే ఏడాది జనవరి 5న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు APPSCని కోరారు. వారి అభ్యర్థనకు APPSC సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. DSC తేదీల ప్రకటనలను బట్టి గ్రూప్-2 ప్రధాన పరీక్ష తేదీలపై నిర్ణయం తీసుకోనుంది. గ్రూప్-2 మెయిన్స్ జనవరి 5న జరగాల్సి ఉండగా ఫిబ్రవరి 23న ఈ పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై APPSC నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.