కృష్ణా: విజయవాడ లోటస్‌లో సోమవారం అర్ధరాత్రి హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. హత్య చేసిన నిందితుడు నరసింహారాజు మృతిచెందిన రఫీ ఇద్దరు స్నేహితులు. సోమవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్య వివాదం నెలకొంది. దీంతో నరసింహారాజు రఫీని హత్యచేశాడు. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి స్వయంగా లొంగిపోయాడు.