CTR: పిడుగుపాటు ఓ ఇంట తీరని విషాదాన్ని నింపిన ఘటన ఆదివారం KVపల్లె మండలంలో జరిగింది. నూతనకాల్వ గ్రామం గుట్టలపై నడింపల్లెకు చెందిన నాగరాజ నాయుడు(45) పొలం వద్ద పనులు చేస్తుండగా ఉన్న పళంగా పిడుగుపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. మరోవైపు ఆయన భార్య పార్వతి (37), తల్లి చిన్నక్క (70) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పీలేరు ఆసుపత్రికి తరలించారు.