AP: నంద్యాల జిల్లాలోని శ్రీకరి ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగ్గా.. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి రోగులను కాపాడారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.