వైఎస్ వివేకా కేసు(YS Viveka Case)లో మరోసారి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy), ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి(Ys Bhaskar reddy), ఉదయ్ కుమార్ లకు కోర్టు మరోసారి రిమాండ్ ను పొడిగించింది. జూన్ 2వ తేది వరకూ రిమాండ్ పొడిగిస్తూ సీబీఐ కోర్టు(CBI Court) తీర్పునిచ్చింది. గతంలో విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో మళ్లీ రిమాండ్ (Remand)ను పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులిచ్చింది.
సీబీఐ కోర్టు(CBI Court) రిమాండ్‌ను పొడిగించడంతో భాస్కర్ రెడ్డి(Ys Bhaskar Reddy), ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తిరిగి తరలించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Ys Viveka Case)లో వైఎస్ భాస్కర్ రెడ్డిని కీలక నిందితుడిగా గుర్తించి ఏప్రిల్ 16వ తేదిన పులివెందులలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
వివేకా హత్య కేసు(Ys Viveka case)లో భాస్కర్ రెడ్డి ఫోన్‌ను సీబీఐ అధికారులు గతంలోనే సీజ్ చేశారు. హైదరాబాద్ లో విచారణ అనంతరం ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీబీఐ మెజిస్ట్రేట్ వద్ద వైఎస్ భాస్కర్ రెడ్డి(Ys Bhaskar Reddy)ని హాజరు పరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించింది. నేటితో ఆ రిమాండ్ ముగిసింది. దీంతో సీబీఐ కోర్టు(CBI Court) మరోమారు రిమాండ్ ను పొడిగిస్తూ ప్రకటించింది.