ASR: ముంచంగిపుట్టు మండలం అసరాడ జంక్షన్ వద్ద 860 కిలోల గంజాయి పట్టుబడిందని పాడేరు అదనపు ఎస్పీ ధీరజ్ శుక్రవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో ముంచంగిపుట్టు ఎస్సై తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనం స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు.