Snow leopard hunts: ఆ చిరుత ఎలా వేటను చూసి ఆశ్చర్యపోతారు
స్నో చిరుతలను (Snow leopards) ఘోస్ట్ ఆఫ్ ది మౌంటెన్స్ (ghost of the mountains) అని కూడా పిలుస్తుంటారు. ఇవి చాలా అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. తాజాగా లడఖ్ లో ఓ మంచు చిరుత పులి మరో జంతువును వేటాడుతున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
స్నో చిరుతలను (Snow leopards) ఘోస్ట్ ఆఫ్ ది మౌంటెన్స్ (ghost of the mountains) అని కూడా పిలుస్తుంటారు. ఇవి చాలా అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. తాజాగా లడఖ్ లో ఓ మంచు చిరుత పులి మరో జంతువును వేటాడుతున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్లు అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి (Indian Forest Service – IFS) పర్వీన్ కాస్వాన్ ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. ఈ వీడియోలో ఓ మంచు చిరుత ఓ జంతువును వేటాడుతున్నట్లుగా ఉంది. మంచు కొండ వాలుగా ఉండటంతో ఆ జంతువు జారిపడింది. పులి కూడా జారి పడుతున్నట్లుగా కనిపించినప్పటికీ, మొత్తానికి దానిని పట్టేసింది. వాట్ ఎ బ్రిలియంట్ హంటర్ అంటూ ఈ అధికారి క్యాఫ్షన్ పెట్టి షేర్ చేశారు.
ఈ వీడియో ఫుటేజీ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. మార్చి 13వ తేదీన ఉల్లాయ్ సమీపంలో దీనిని తీశారు. ఈ వీడియోను 332.4K వ్యూస్ వచ్చాయి. 500కు పైగా రీట్వీట్లు, దాదాపు 3వేల లైక్స్ వచ్చాయి. పులి వేటకు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. What a fine hunter, Whatta catch అంటూ పేర్కొంటున్నారు. ఓ ట్విట్టరిటీ… ఫోటోగ్రాఫర్ బ్రిలియంట్ (Photographer is more brilliant) అని కామెంట్ చేశాడు.
స్నో లియపర్డ్ (snow leopard) ఒక నైపుణ్యం కలిగిన వేట చిరుత. క్లిష్ట సమయాల్లో తన బరువు కంటే మూడు రెట్ల బరువైన దానిని కూడా వేటాడగలదు. ఇది ఎక్కువగా భారత్ లోని జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన, పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ప్రకారం మంచు చిరుతలు మధ్య ఆసియాలోని 12 దేశాలలో కాస్త వ్యాప్తి చెందాయి. ఎత్తైన, కఠినమైన పర్వత ప్రకృతి ప్రదేశాల్లో ఉంటాయి. ఇవి అరుదైన వన్య ప్రాణులు. వీటి చర్మం, ఎముకల, ఇతర శరీర భాగాల కోసం వేటాడుతున్నందున వీటికి ముప్పు పొంచి ఉంది.