»Shocking News For Farmers In Telangana If The Crop Is Lost For The Second Time No Help Will Be Given
Telangana:లో రైతులకు షాకింగ్ న్యూస్..రెండోసారి పంట నష్టపోతే సాయం ఇవ్వలేం!
తెలంగాణ(telangana)లో రైతుల(farmers)కు షాకింగ్ న్యూస్ తగిలింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్(KTR), హరిశ్ రావు, ఎర్రబెల్లి చెబుతున్నారు. కానీ అమల్లో మాత్రం అది జరగడం లేదు. వ్యవసాయ శాఖ(agriculture department) రైతులకు ఒక్కసారి మాత్రమే సాయం అందిస్తామని, రెండోసారి నష్టపోయిన రైతులకు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ(Telangana)లో వర్షం కారణంగా రెండోసారి పంట నష్టపోయిన రైతులకు బ్యాస్ న్యూస్. ఎందుకంటే రెండోసారి ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు అవకాశం లేదని వ్యవసాయ శాఖ(agriculture department) జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మార్చి నెలలో పంట నష్టపోయిన వారికి తొలిసారిగా మాత్రమే రూ.10 వేల సాయం అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో అనేక సార్లు అకాల వర్షాల కారణంగా పలువురు రైతులు రెండు సార్లకుపైగా పంట నష్టపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ(agriculture department) ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు.. రెండోసారి కూడా పంట నష్ట సాయం ఇవ్వాలని కోరుతున్నా కూడా అధికారులు మాత్రం సారీ అని చెబుతూ దాటవేస్తున్నారని అంటున్నారు.
ఇంకోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్(BRS) మంత్రులు కేటీఆర్(KTR), హరీశ్ రావు, ఎర్రబెల్లి కూడా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వ్యాఖ్యలు చేశారు. కానీ అమలులో మాత్రం అది జరగడం లేదు. రెండో సారి పంట నష్టపోయిన రైతుల పరిస్థితి ఎంటని ఈ క్రమంలో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్చిలో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10,000 పరిహారం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో మార్చి 23న ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో కేసీఆర్(KCR) పర్యటించి రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు రూ.228 కోట్లు మంజూరు చేశారు.
కానీ దెబ్బతిన్న పంటల గణన కొనసాగుతుండడంతో రైతుల(farmers)కు ప్రకటించిన సొమ్ము(money) ఇంకా అందలేదు. ఇదే క్రమంలో ఏప్రిల్లో కూడా చాలాసార్లు వర్షం కురవడంతో అనేక మంది రైతుల పంటలు మళ్లీ దెబ్బతిన్నాయి. మరోవైపు మరో రెండు రోజులు రాష్ట్రంలో వానలు ఉన్న నేపథ్యంలో రైతులు పంట(crop)ను ఎలా కాపాడుకోవాలో తెలియక భయాందోళన చెందుతున్నారు.