దేవర టీమ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరు చేయని విధంగా సహాయం చేసారు. కొన్ని సంవత్సరాల ఎన్టీఆర్ నటించిన “ధమ్ము”, “బాద్షా” సినిమాల సమయంలో చంద్రబాబు అధికారంలో లేనప్పుడు, ఎన్టీఆర్ అభిమానుల కొంతమంది TDP, చంద్రబాబు నాయుడు, లోకేష్లు కలిసి ఎన్టీఆర్ కెరీర్‌కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే. ఎంతోమంది అభిమానులు టీడీపీ నుంచి బల్క్ మెసేజిలు పం...
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నందిని నెయ్యి పునఃప్రారంభించింది. గత ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదంలో వాడిన నెయ్యి లో పశువుల కొవ్వు , ఇతర కల్తీ పదార్థాలు ఉపయోగిస్తున్నారని వస్తున్న ఆరోపణల కారణంగా, TTD కర్ణాటకకు చెందిన నందిని ఉత్పత్తులను మళ్లీ ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఈ ఉదయం బెంగళూరులోని నందిని నెయ్యి ఉన్న రెండు టాంకర్ల...
తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపై జరిగిన వివాదం నేపథ్యంలో, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, లడ్డూ ప్రసాదంలో నాణ్యతకు సంబంధించి అనేక సమస్యల గురించి పోస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్‌పై స్పందిస్తూ, “మీరు డిప్యూటీ సీఎం. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు నేషనల...
హైదరాబాద్ నగరంలో గత కొన్ని గంటలుగా భారీ వర్షాలు పడుతున్నాయి, దీని ప్రభావం నగరంలోని అనేక ప్రాంతాలపై పడింది, నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, ఎన్నో కాలనీలు జలమయంగా మారాయి, వర్షానికి నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుండి ఇళ్ళకు వెళ్లేవారు రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్,...
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “దేవర” సినిమా ఆన్లైన్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్‌లో తెఓపెన్ అయ్యాయి. సాధారణంగా, ఎలాంటి స్టార్ హీరో సినిమాల బుకింగ్స్ అయినా హైదరాబాద్‌లో ముందుగా ప్రారంభమవుతుంటాయి, తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి వస్తాయి. కానీ, “దేవర” చిత్ర నిర్మాతలు ప్రత్యేక షోలు, టిక్కెట్ ధరల కోసం అనుమతులు పొందడంతో, ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోనే ముందస్తు బుకిం...
బెంగళూరు వ్యాలీ కవల్ ఏరియాలోని ఓ అపార్టుమెంట్ సింగిల్ బెడ్ రూం ఫ్లాట్‌లో అమానుష ఘటన జరిగింది. 26 ఏళ్ల యువతిని 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టారు. ఆ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఫ్లాట్‌లో తనిఖీ చేసి.. ఓ యువతిని 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టినట్లు గుర్తించారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు వినూత్న మోసానికి తెరదీశారు. ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5లక్షల ఉద్యోగం ఇస్తానని ప్రకటన ఇచ్చాడు. ఈ ఆఫర్ చూసిన ఓ యువకుడు అతడిని సంప్రందించాడు. దీంతో ఆ యువకుడి నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.24,800 కట్టించుకున్నాడు. అనంతరం రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయి...
సత్యసాయి: హిందూపురంలోని సబ్ జైల్‌ను సీనియర్ సివిల్ జడ్జి మానిపాటి శ్రీధర్ శనివారం తనిఖీ చేశారు. ఆయన జైలులోని పరిసరాలను, నేరస్తుల గదులను, జైలులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నేరస్తులతో మాట్లాడుతూ.. క్షణికావేశంలో నేరాలు చేసి జైలుకు రావడం వల్ల మానసిక ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు.
JGL: మద్యం సేవించి వాహనా నడిపిన కేసులో కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన వడ్లకొండ నాగభూషణం, మెట్పల్లికి చెందిన గుండేటి మధుసూదన్‌లకు 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ గంప కరుణాకర్ శనివారం తీర్పునిచ్చారు. వీరిద్దరు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారన్నారని వివరించారు.
KMR: బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగు పడి గ్రామంలోని కుమ్మరి సంఘం అనే వ్యక్తి గేదె మృతి చెందినది. గేదె సుమారు 30,000 రూపాయలు ఉంటుందని, 10 రోజులలో ప్రసవించేదని ఆయన బోరున విలపించారు. బాధితుడికి ప్రభుత్వం సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
SRPT: సూర్యాపేటలో పిడుగుపాటు శబ్దానికి ఓ వ్యక్తి గాయాలు పాలయ్యాడు. స్థానికుల వివరాల మేరకు చింతల చెరువు సమీపంలో పొలం పనులు చేసుకుంటూ ఉండగా భారీ వర్షానికి పక్కకు నిలబడ్డాడు. ఒక్కసారిగా పిడుగు పడి గట్టిగా శబ్దం రాగా మెరుగు అనిత్ (28) అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. హుటాహుటిన వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
NGKL: పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన రాముడు (46) పొలంలో పశువులు మేపుతుండగా ఒకసారిగా ఉరుములు మెరుపులతో కూడిన శబ్దం వచ్చి పిడుగు పడింది. చేతిలో ఉన్న ఫోన్ పేలింది. దీంతో రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు.
గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు. తాజాగా నగరంలోని దక్షిణ ప్రాంతంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని.. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పంచాయతీ పరిధిలో గల బత్తులనగర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన సోడి వెంకటేష్, గోపి కుటుంబానికి చెందిన ఇల్లు కరెంట్ షాక్తో కాలిపోయింది. సుమారు 1లక్ష రూపాయిల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: సూర్యాపేటలో ఓ ఇంటిపై పిడుగు పడింది. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో బారీ వర్షం కురుసింది. తాళ్లగడ్డ చెందిన లూనావత్ విజయ్ సింగ్ ఇంటి స్లాబ్ పై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 11ఫ్యాన్లు, 3 టీవీలు కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుచుకున్నారు.