AP: తిరుపతి జిల్లా చిల్లకూరు హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటెయినర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అరుణాచలం దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులు నెల్లూరు వనంతోపుకు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు...
ATP: తాడిపత్రి పరిధిలోని పెద్ద పొడమల గ్రామ సమీపంలో మల్లికార్జున(43) అనే వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఇంఛార్జ్ ఎస్సై నాగప్ప చెప్పారు. పెద్ద పొడమల గ్రామానికి చెందిన మల్లికార్జున గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
PLD: రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్ర గాయాల పాలైన సంఘటన మాచర్ల పట్టణ పరిధిలోని నాగార్జునసాగర్ హైవే వద్ద ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శనివారం రాత్రి జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొని నలుగురు యువకులు మృతిచెందారు. ఈ ప్రమాద ఘటన బక్కరాయసముద్రం మండలం దెయ్యాలకుంటపల్లి దగ్గర జరిగింది. మృతులు అనంతపురంవాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: బాపట్లలో శనివారం రాత్రి ఓ ఆటోను కారు ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాత్రి బాపట్ల సూర్యలంక రహదారిలో వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిందన్నారు. ఆటోను ఢీ కొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ఆ కారును అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TPT: చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో కారులోని ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలో మృతి చెందారు. గాయపడ్డ మరికొంతమందిని వైద్య చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-బెంగళూరు హైవేపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: విజయవాడ శివారు గొల్లపూడిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడ దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గొల్లపూడికి చెందిన దినేశ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడకక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు.
KKD: తుని మండలం ఎర్రకోనేరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ద్విచక్ర వాహనంపై ఓ పరీక్ష నిమిత్తం ఇద్దరు వెళ్తుండగా వారిని కారు ఢీకొట్టిందని తుని రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: అల్లినగరం సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మహానందికి చెందిన వెంకటరమణ నంద్యాలలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తన భార్యను చూసేందుకు బైక్ పై నంద్యాలకు వెళ్తుండగా అల్లినగరం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. తీవ్ర గాయాలైన అతణ్ని కుటుంబీకులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా: ఊటుకూరు శివారు నారాయణపురంలోని తోట చక్రవర్తికి చెందిన ఒంటి నెట్టాడు తాటాకిల్లు శనివారం విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ దగ్ధమైంది. దీంతో రూ.3 లక్షలు మేర ఆస్తినష్టం వాటిల్లింది. చక్రవర్తి వ్యవసాయ పనులు నిమిత్తం వెళ్లగా ఆయన భార్య బంగారమ్మ మనవడుని అంగన్వాడీకి తీసుకువెళ్లింది. ఆసమయంలో విద్యుత్తు షార్ట్ సర్య్కూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు వ్యాప్తించాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఉత్తరప్రదేశ్ నోయిడాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫై ఓవర్‌పై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ మీద ఉన్న మహిళ ఎగిరి రెండు ఫైఓవర్ల మధ్యలో ఉన్న పిల్లర్‌పై పడి ప్రాణాలు దక్కించుకుంది. పిల్లర్‌పై పడ్డ యువతిని పోలీసులు, వాహనదారులు కాపాడారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేవర టీమ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరు చేయని విధంగా సహాయం చేసారు. కొన్ని సంవత్సరాల ఎన్టీఆర్ నటించిన “ధమ్ము”, “బాద్షా” సినిమాల సమయంలో చంద్రబాబు అధికారంలో లేనప్పుడు, ఎన్టీఆర్ అభిమానుల కొంతమంది TDP, చంద్రబాబు నాయుడు, లోకేష్లు కలిసి ఎన్టీఆర్ కెరీర్‌కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే. ఎంతోమంది అభిమానులు టీడీపీ నుంచి బల్క్ మెసేజిలు పం...
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నందిని నెయ్యి పునఃప్రారంభించింది. గత ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదంలో వాడిన నెయ్యి లో పశువుల కొవ్వు , ఇతర కల్తీ పదార్థాలు ఉపయోగిస్తున్నారని వస్తున్న ఆరోపణల కారణంగా, TTD కర్ణాటకకు చెందిన నందిని ఉత్పత్తులను మళ్లీ ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఈ ఉదయం బెంగళూరులోని నందిని నెయ్యి ఉన్న రెండు టాంకర్ల...
తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపై జరిగిన వివాదం నేపథ్యంలో, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, లడ్డూ ప్రసాదంలో నాణ్యతకు సంబంధించి అనేక సమస్యల గురించి పోస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్‌పై స్పందిస్తూ, “మీరు డిప్యూటీ సీఎం. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు నేషనల...