Kattappa Sathyaraj: కట్టప్ప ‘సత్యరాజ్’ ఇంట తీవ్ర విషాదం!
బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించిన కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్(Sathyaraj) ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. 94 ఏళ్ల వయసులో ఆయన తల్లి నాదాంబాళ్ కాళింగరాయర్ కన్నుమూశారు. దీంతో హుటాహుటిన ఆయన తమిళనాడు(tamilnadu)కి బయలుదేరారు.
కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్(Sathyaraj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలిలో కట్టప్పగా ఆయన చేసిన క్యారెక్టర్ ఎవర్ గ్రీన్‌గా నిలిచింది. బాహుబలి తర్వాత సత్యరాజ్ కంటే.. కట్టప్పగానే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు సత్యరాజ్. అప్పటి నుంచి ఆయనను కట్టప్ప అనే పిలవడం మొదలుపెట్టారు. బాహుబలి తర్వాత తెలుగుతో పాటు అన్ని భాషల్లో భారీ ఆఫర్స్ సొంతం చేసుకున్నాడు సత్యరాజ్. ప్రస్తుతం సత్యరాజ్ హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన తల్లి కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ కాళింగరాయర్ చనిపోయారు.
గత కొన్నేళ్లుగా ఆమె వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని.. కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో శుక్రవారం సాయంత్రం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు(family) తెలిపారు. దీంతో సత్యరాజ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లి మరణవార్త విన్నవెంటనే హైదరాబాద్(hyderabad)లో షూటింగ్ చేస్తున్న సత్యరాజ్ వెంటనే కోయంబత్తూర్(koyambattur) పయనమయ్యారు. ఇక సత్యరాజ్ తల్లి మరణ వార్త తెలిసి.. తమిళనాడు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. డీఎమ్‌కే ప్రభుత్వంలోని మంత్రులు తమ సంతపాన్ని తెలుపుతున్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా సత్యరాజ్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక నాదాంబాళ్ కాళింగరాయర్‌కు ముగ్గురు పిల్లలు ఉండగా..వారిలో ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి సత్యరాజ్ కాగా కుమార్తెలు కల్పన, రూపగా ఉన్నారు.