»Balakrishna In Jailer Movie But Miss The Hit Chance
Jailer:’జైలర్’లో బాలయ్య..హిట్ ఛాన్స్ మిస్సైందా!
సూపర్ స్టార్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు.. ఇది రజనీ కాంత్ రేంజ్.. తలైవా చించేశాడు.. భాషా రేంజ్ సినిమా ఇచ్చాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. జైలర్(jailer) పీక్స్ అంటూ పండగ చేసుకుంటున్నారు రజనీ కాంత్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో తమిళ్, మళయాళ, హిందీ సీనియర్ హీరోలు కామియో అప్పియరెన్స్ ఇవ్వడంతో.. థియేటర్ టాపులు లేచిపోతున్నాయి. ఇక బాలయ్య(balakrishna) కూడా జైలర్ ఉండి ఉంటే.. స్క్రీన్స్ చిరిగిపోయి ఉండేవి. కానీ జస్ట్ మిస్ అంటున్నాడు జైలర్ డైరెక్టర్.
balakrishna in Jailer movie But miss the hit chance
జైలర్(Jailer) సినిమాకు తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ జరగలేదు. కొంత కాలంగా రజనీ(rajinikanth) ఫ్లాపుల్లో ఉండడంతో..పెద్దగా బజ్ లేకుండానే థియేటర్లోకి వచ్చింది జైలర్. పైగా నెక్స్ట్ డే మెగాస్టార్ భోళా శంకర్ రిలీజ్ ఉండడంతో.. జైలర్ పరిస్థితేంటి? అనే సందేహాలు వచ్చాయి. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన జైలర్..హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు. డే వన్ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లకు పైగా షేర్.. 12 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా రూ.95 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. ఇది రజనీకాంత్ రేంజ్ అని ప్రూవ్ చేసింది. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో..రజినీ సరసన రమ్యకృష్ణ నటించగా తమన్నా, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇక మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జాకీ ష్రాఫ్ క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. వీళ్ల కామియో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది.
అయితే మాలీవుడ్ నుంచి మోహన్ లాల్(mohanlal).. కన్నడ నుంచి శివన్న..బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ లానే టాలీవుడ్ నుంచి కూడా ఒక స్టార్ హీరోను క్యామియోగా తీసుకోవాలని అనుకున్నాడట. దర్శకుడు నెల్సన్(Nelson Dilipkumar). ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘జైలర్‌లో పవర్ఫుల్ కాప్ క్యామియోలో బాలకృష్ణ(balakrishna) సర్ని పెట్టాలని అనుకున్నాను. కానీ స్క్రిప్ట్ అలాంటి రోల్ పర్ఫెక్ట్గా లేకపోవడంతో కుదరలేదని’ అని తెలిపాడు. దీంతో జైలర్‌లో బాలయ్య జస్ట్ మిస్ అని చెప్పొచ్చు. ఒకేవళ బాలయ్య కనుక ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసి ఉంటే..సినిమాకు భారీ హైపే కాదు థియేటర్లు పూనకాలతో ఊగిపోయేవి. ఒకవేళ రజినీ అడిగి ఉంటే.. బాలయ్య నో చెప్పే ఛాన్సెస్ తక్కువ. కానీ అలాంటి క్యారెక్టర్ డిమాండ్ చేయకపోవడంతో.. అలా జరగలేదని చెప్పొచ్చు.