మెక్సికో క్వెరెటారోలోని ఓ బార్లో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కొంతమంది దుండగులు బార్లోకి ప్రవేశించి అక్కడ కూర్చున్న వారిని, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే హింస కొనసాగుతున్నందున, ప్రాంతీయ సంఘర్షణలకు సంబంధించిన హింస కారణంగా అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.