ASR: చింతపల్లి మండలంలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మర్రిపాలెం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. దీంతో బస్సు రోడ్డు కింద కాలువలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు, బస్సులోని కొందరూ స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.